మహిళా బిల్లుపై కవిత పోరాటం: ప్రశంసలు కురిపించిన వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య

మహిళా బిల్లు కోసం  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  చేస్తున్న పోరాటాన్ని  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య  అభినందించారు.

YSRCP MP Krishnaiah appriciates  BRS MLC Kalvakuntla Kavitha lns


హైదరాబాద్:మహిళా బిల్లు కోసం పోరాటం చేస్తున్న  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వైఎస్ఆర్‌సీపీ ఎంపీ  ఆర్. కృష్ణయ్య  అభినందించారు.మహిళా బిల్లు కోసం కవిత పోరాటాన్ని ఆయన ప్రస్తావిస్తూ  ఈ బిల్లులో  బీసీ మహిళలకు ప్రత్యేక కోటా పెట్టాలని  డిమాండ్ చేయాలని సూచించారు.  


మహిళా బిల్లు విషయమై  కవిత  పోరాటం వల్ల  కేంద్రంలో కదలిక  వచ్చిందని ఆర్. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.కవిత  పోరాటంతో  అన్ని పార్టీలు కూడ  మహిళా బిల్లు విషయమై ఆలోచిస్తున్నాయన్నారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు పెట్టె యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Videos

గతంలో న్యూఢిల్లీ వేదికగా  కల్వకుంట్ల కవిత పార్లమెంట్ సమావేశాల్లో  మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టాలని ఆందోళన నిర్వహించింది.ఈ ఆందోళనలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడ పాల్గొన్నారు.  అయితే  బీఆర్ఎస్ ఇటీవల  విడుదల చేసిన  ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో  మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించకపోవడంపై  విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

vuukle one pixel image
click me!