అప్పుడే పెళ్లి ఎందుకు అన్న ప్రేయసి.. ప్రియుడు ఏం చేశాడంటే..

Published : Jun 22, 2021, 08:07 AM IST
అప్పుడే పెళ్లి ఎందుకు అన్న ప్రేయసి.. ప్రియుడు ఏం చేశాడంటే..

సారాంశం

ఆ మాటకే బాగా హర్ట్ అయిన యువకుడు ఆవేశంతో.. నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే.. వెంటనే పెళ్లి చేసుకుందామని ప్రియుడు.. ప్రేయసిని కోరాడు. అందుకు ప్రేయసి నిరాకరించింది. పెళ్లికి అప్పుడే ఏం తొందర వచ్చిందని.. కొంతకాలం తర్వాత చేసుకుందామని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.

అయితే.. ఆ మాటకే బాగా హర్ట్ అయిన యువకుడు ఆవేశంతో.. నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బాలానగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మూసాపేట రెయిన్ బోవిస్టాస్ లో నివాసముంటున్న శుభమ్(27) అమెజాన్ లో ఉద్యోగి. మూడు సంవత్సరాలుగా..  బాలానగర్ లో ఉంటున్న సోనియా గోగికర్ ను ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడంతో.. పెద్దలు కూడా వారి పెళ్లికి అంగీకరించారు.

అయితే.. పెళ్లికి శుభమ్ తొందరపెడుతుండటంతో... సోనియా నిరాకరించింది. అప్పుడే పెళ్లికి తొందరెందుకని.. కొంతకాలం తర్వాత చేసుకుందామని చెప్పింది. తన అక్క పెళ్లి తర్వాత తాను  చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఆమె మాటలతో హర్ట్ అయిన శుభమ్... నాలుగు అంతస్థులపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య  చేసుకున్నాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం