నెక్లెస్ రోడ్డులో ప్రేమ జంట అసభ్య ప్రవర్తన: ప్రశ్నిస్తే దాడి

Published : Jun 13, 2019, 06:24 PM IST
నెక్లెస్ రోడ్డులో ప్రేమ జంట అసభ్య ప్రవర్తన: ప్రశ్నిస్తే దాడి

సారాంశం

హైద్రాబాద్ నెక్లెస్ రోడ్డులో  కారులోనే ప్రేమ జంట అసభ్య ప్రవర్తనపై అభ్యంతరం తెలిపిన ముగ్గురు యువకులపై ప్రేమ జంట దాడికి పాల్పడంది. ఈ దాడిలో ఓ యువకుడు  తీవ్రంగా గాయపడ్డాడు.  

హైదరాబాద్: హైద్రాబాద్ నెక్లెస్ రోడ్డులో  కారులోనే ప్రేమ జంట అసభ్య ప్రవర్తనపై అభ్యంతరం తెలిపిన ముగ్గురు యువకులపై ప్రేమ జంట దాడికి పాల్పడంది. ఈ దాడిలో ఓ యువకుడు  తీవ్రంగా గాయపడ్డాడు.

హైద్రాబాద్‌ నెక్లెస్ రోడ్డులో  ముగ్గురు యువకులు తమ బర్త్‌డే వేడుకలు చేసుకొనేందుకు గురువారం తెల్లవారుజామున  వచ్చారు. అదే సమయంలో  రోడ్డు పక్కనే కారులో ఉన్న ప్రేమ జంట అసభ్యంగా ప్రవర్తించింది.

ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు యువకులు ప్రేమ జంట తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రేమ జంట ముగ్గురు యువకులపై దాడికి దిగారు. ప్రియుడు రాయితో  ముగ్గురు యువకులపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘర్షణను అప్పుడే అటు వైపుగా వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన యువకులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరో వైపు దాడికి పాల్పడిన ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే