టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కే.కే : లోక్‌సభాపక్ష నేతగా నామా

By Siva KodatiFirst Published Jun 13, 2019, 4:45 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావును ఆ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావును ఆ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

ఈ భేటీలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చంచారు. అనంతరం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, లోక్‌సభాపక్షనేత, రాజ్యసభ పక్షా నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పార్లమెంటరీ పార్టీ నేతగా కే.కేశవరావు, లోక్‌సభ పక్షానేతగా ఖమ్మం ఎంపీ. నామా నాగేశ్వరరావు, రాజ్యసభ పక్షనేతగా కె.కె, ఉప నాయకుడిగా మెదక్ ఎం.పి. కొత్త ప్రభాకర్ రెడ్డిని, విప్ గా జహీరాబాద్ ఎం.పి. బిబి పాటిల్ ను ఎన్నుకున్నారు. ఇక రాజ్యసభలో ఉప నాయకుడిగా బండ ప్రకాశ్ ను, విప్ గా జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ఎన్నుకున్నారు. 

టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుల ఎంపికకు సంబంధించిన సమాచారంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. 

click me!