పోలీసులపై యువకుడి దాడి.. బండి ఆపారని రచ్చ...

By AN TeluguFirst Published Feb 26, 2021, 1:47 PM IST
Highlights

హైదరాబాద్ లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. రాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని ఆపిన ట్రాఫిక్ పోలీసుపై పిడిగుద్దులతో దాడి చేశాడు. ఈ దాడిలో ట్రాఫిక్ సీఐతో పాటు సిబ్బందిమీదా దాడికి ఎగబడ్డారు. అడ్డొచ్చిన హోంగార్డుమీద పిడిగుద్దులు కురిపించాడు. గాయపడ్డ హోంగార్డును తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. రాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని ఆపిన ట్రాఫిక్ పోలీసుపై పిడిగుద్దులతో దాడి చేశాడు. ఈ దాడిలో ట్రాఫిక్ సీఐతో పాటు సిబ్బందిమీదా దాడికి ఎగబడ్డారు. అడ్డొచ్చిన హోంగార్డుమీద పిడిగుద్దులు కురిపించాడు. గాయపడ్డ హోంగార్డును తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ ఘటన పోలీసులపై పెరుగుతున్న దాడులకు నిదర్శనంగా నిలుస్తోంది. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో దర్వేజ్ అనే యువకుడు బండి సైలెన్సర్ తీసేసి మరీ మితిమీరిన శబ్దంతో రోడ్డుపై చక్కర్లు కొట్టాడు. 

దీన్ని గమనించిన అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సీఐ ఆ బైక్‌ను ఆపాల్సిందిగా హోంగార్డు రాథోడ్ కు సూచించారు. రాథోడ్ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా ఆ యువకుడు రెచ్చిపోయాడు. పిడిగుద్దులతో దాడికి దిగారు. 

ఇది గమనించిన సీఐ పరుగున అక్కడికి వెళ్లగా దర్వేజ్ సీఐని కూడా నెట్టేసి దాడికి పాల్పడ్డాడు. పోలీస్ సిబ్బందితో పాటు ఇతర వాహనదారులు కూడా ఎంతగా చెప్పినా అతను వినిపించుకోలేదు. అతనికి అతని స్నేహితులు కూడా తోడై నానా హంగామా సృష్టించాడు.

దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. యువకుడితో పాటు అతడి స్నేహితుల మీద కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

నాలుగురోజుల క్రితం సేమ్ ఇలాంటి ఘటనే ఆంధ్ర, కర్నాటక బార్డర్ లో జరిగింది.  ఏపీకి చెందిన ఓ యువకుడు పోలీసులపై ఇదే రేంజ్ లో తిరగబడ్డాడు. నా వాహనాన్నే ఆపుతారా? ప్రిన్సిపల్ సెక్రటరీతో డైరెక్టర్ గా మాట్లాడే రేంజ్ నాది.. నన్నే ప్రశ్నిస్తారా అంటూ హంగామా చేశాడు. దీంతో పోలీసులు అతన్ని తమదైనశైలిలో మందలించారు.

అయితే తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండడంతో పోలీసుల్లో ఆందోళన మొదలైంది. అయితే, తప్పెవరు చేసినా ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకు పంపించడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. 

click me!