కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్య

Published : Feb 26, 2021, 11:45 AM ISTUpdated : Feb 26, 2021, 12:19 PM IST
కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్య

సారాంశం

సూర్యాపేట జిల్లాలో కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కోదాడ పెద్ద చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంది.

కోదాడ: సూర్యాపేట జిల్లాలో కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కోదాడ పెద్ద చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంది.ఈ నెల 25 నుండి ప్రేమ జంట అదృశ్యమైంది.  దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవాళ ఉదయం చెరువులో  మృతదేహాలు నీళ్లలో పైకి తేలాయి.ఈ విషయాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను చెరువు నుండి బయటకు తీశారు. 

కోదాడ మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన మణికంఠ,  అదే గ్రామానికి చెందిన యువతి కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొన్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోననే భయంతో ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతుల కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం