టిక్ టాక్ లో సీఎం కేసీఆర్ పై విమర్శలు..యువకుడు అరెస్ట్

Published : Apr 24, 2019, 11:36 AM IST
టిక్ టాక్ లో సీఎం కేసీఆర్ పై విమర్శలు..యువకుడు అరెస్ట్

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ ని ధూషించినందుకు పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

తెలంగాణ సీఎం కేసీఆర్ ని ధూషించినందుకు పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... కొద్ది రోజుల క్రితం ఓ యువకుడు టిక్ టాక్  యాప్ లో కేసీఆర్ ని దారుణంగా తిడుతూ వీడియో చిత్రీకరించాడు. తర్వాత దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఆ వీడియో వైరల్ కావడంతో... విషయం పోలీసులకు తెలిసింది. దీంతో.. యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ టిక్ టాప్ యాప్ కారణంగా యువత చెడిపోతుందనే కారణంతో ఇప్పటికే ఈ యాప్ ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి దీనిని తొలగించారు. అయితే.. కొత్తగా ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోలేరు..కానీ.. ఆల్రెడీ ఉన్నవాళ్లు మాత్రం వినియోగించుకునే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

సిద్ధిపేట‌పై వ‌రాల జ‌ల్లు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ. 544 కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు
సిద్ధిపేట‌లో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌.. ప్ర‌తీ కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌లు