బంధాల్ని చిదిమేస్తున్న ఆస్తులు... అన్నని దారుణంగా చంపిన తమ్ముళ్లు

Siva Kodati |  
Published : Mar 05, 2021, 04:09 PM IST
బంధాల్ని చిదిమేస్తున్న ఆస్తులు... అన్నని దారుణంగా చంపిన తమ్ముళ్లు

సారాంశం

ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్న రోజులివి. కన్న తల్లిదండ్రులను, భార్య, బిడ్డలు, తోడ బుట్టిన వాళ్లను దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా ఆస్తి  కోసం ఇద్దరు తమ్ముళ్లు అన్ననే చంపేశారు. 

ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్న రోజులివి. కన్న తల్లిదండ్రులను, భార్య, బిడ్డలు, తోడ బుట్టిన వాళ్లను దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా ఆస్తి  కోసం ఇద్దరు తమ్ముళ్లు అన్ననే చంపేశారు.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు యాదయ్య, పాండు, శ్రీనివాస్‌ మధ్య గత కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శుక్రవారం వారిలో పెద్దవాడైన యాదయ్యతో తమ్ముళ్లిద్దరూ ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఘర్షణ తారస్థాయికి చేరడంతో పాండు, శ్రీనివాస్‌ కలిసి అన్న యాదయ్యను కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య అనంతరం పాండు, శ్రీనివాస్‌ శంకర్‌పల్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?