విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదు: కేటీఆర్ విమర్శలు

By narsimha lodeFirst Published Mar 5, 2021, 12:32 PM IST
Highlights

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

శుక్రవారం నాడు హైద్రాబాద్ లో నిర్వహించిన టీ నెక్స్ట్  సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ వస్తే రాష్ట్రంలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. విభజన చట్టం హామీలు అమలు కావడం లేదన్నారు. బుల్లెట్ ట్రైన్ ను గుజరాత్ కు తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు.

విభజన  చట్టంలో  అనేక హామీలను అప్పటి ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందన్నారు. కానీ ప్రస్తుతం ఈ హామీలు అమలు కావడం లేదన్నారు.రాష్ట్ర విభజన సమయంలో రెండు ప్రాంతాల అభివృద్దికి గాను విభజనచట్టంలో పలు అంశాలను పొందుపర్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామన్నారు. అయినా కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు. మేకిన్ ఇండియా అంటున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇండస్ట్రీయల్ జోన్ కూడా కేటాయించలేదన్నారు.
 

Last Updated Mar 5, 2021, 1:42 PM IST