బండి, గుండు, తొండి మాటలు.. చివరికి ప్రజలకి చెవిలో పూలు: బీజేపీపై ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 05, 2021, 03:50 PM IST
బండి, గుండు, తొండి మాటలు.. చివరికి ప్రజలకి చెవిలో పూలు: బీజేపీపై ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

కాజీపేట రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ కేంద్రం సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా స్పందించారు. సమాచార హక్కుచట్టం ప్రశ్నకు రైల్వేకోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు వసరం లేదని కేంద్ర రైల్వేశాఖ చెప్పడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు.

బిజేపీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్‌చేశారు. రేపు ఏం ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని దయాకర్ రావు ప్రశ్నించారు. ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతారు ? తెలంగాణ ప్రజల్ని ఎంత కాలం మోసం చేస్తారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే భారతీయ బొంకుడు పార్టీ అని తేలిపోయిందని ఎర్రబెల్లి సెటైర్లు వేశారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తుంటే బీజేపీ అబద్దాల పునాదులపై అధికారం కోసం అర్రులు చాస్తోందని దయాకర్ రావు విమర్శించారు.

ఇప్పటి దాకా బీజేపీ బండి, గుండు, తొండి మాటలతో ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారంటూ ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఎర్రబెల్లి ఆరోపించారు.

ఐటీఐఆర్‌ ప్రాజెక్టు మాదిరిగానే కాజీపేట రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి బిజెపి మంగళం పాడిందని మంత్రి ఎద్దేవా చేశారు. కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలు మార్లు ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్‌ కోరారని దయాకర్ రావు గుర్తుచేశారు. తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమిస్తామని ఎర్రబెల్లి స్పష్టంచేశారు. 
 
PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu