ఛాదర్‌ఘాట్‌లో ఆటో డ్రైవర్‌పై బ్లేడ్‌తోదాడి, ఎందుకంటే?

Published : Sep 30, 2018, 12:13 PM IST
ఛాదర్‌ఘాట్‌లో ఆటో డ్రైవర్‌పై బ్లేడ్‌తోదాడి, ఎందుకంటే?

సారాంశం

హైద్రాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో ఓ యువకుడు ఆటోడ్రైవర్‌పై బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు

హైదరాబాద్: హైద్రాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో ఓ యువకుడు ఆటోడ్రైవర్‌పై బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆ యువకుడిని అడ్డుకొనేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు కూడ  విఫలమయ్యాయి.

తాను రమ్మన్నచోటుకు రాలేదనే అక్కసుతో ఆ యువకుడు ఆటో డ్రైవర్‌పై  విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్‌పై బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. 

ఆటో డ్రైవర్‌పై బ్లేడ్‌తో  దాడి చేయడంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు ఈ దాడిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తే  వారిపై కూడ దాడి చేశాడు.

దీంతో స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటన సమయంలో ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని  పోలీసులకు స్థానికులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు నిలు

అయితే ఆటో డ్రైవర్‌పై  దాడికి పాల్పడిన వ్యక్తి  ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడికి గురైన ఆటోడ్రైవర్ ను చికిత్స  నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu