
హైదరాబాద్ : హైదరాబాద్ బోరబండ లో విషాద ఘటన చోటు చేసుకుంది. షోయబ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాలుగవ అంతస్తు నుంచి కిందపడి మరణించాడు. అర్ధరాత్రి తన ప్రియురాలి కోసం పిజ్జా తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి బిల్డింగ్ మీదికి వెళ్లి మాట్లాడుకుంటుండగా యువతీ తండ్రి పైకి వచ్చాడు. యువతి తండ్రికి కనిపించకుండా ఉండడం కోసం యువకుడు బిల్డింగ్ చివరికి వెళ్ళాడు. అక్కడి నుంచి జారి కింద పడపడ్డాడు. నాలుగో అంతస్తు నుంచి యువకుడు కింద పడడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందినట్లుగా తెలిసింది.
ఆదివారం తెల్లవారుజామున బోరబండలోని భవనం టెర్రస్‌పై తన ప్రియురాలికి పిజ్జా ఇవ్వడానికి రహస్యంగా 20 ఏళ్ల బేకరీ కార్మికుడు ఒకరు వెళ్లాడు. ఎవరో వస్తున్న అలికిడితో దాక్కోవడానికి ప్రయత్నిస్తుండగా మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. మహ్మద్ షోయబ్ పిజ్జా కొని తన స్నేహితురాలిని కలవడానికి వెళ్లాడు. వీరిద్దరూ మూడంతస్తుల భవనం టెర్రస్‌పై ఉండగా.. ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది.
తన ప్రియురాలి తండ్రి టెర్రస్‌పైకి వస్తున్నాడన్న భయంతో షోయబ్ అటుగా వెళ్తున్న కేబుల్స్‌ను పట్టుకుని ఓ మూలన దాక్కోవడానికి ప్రయత్నించాడు. విద్యుత్ వైరు తగలడంతో టెర్రస్‌పై నుంచి జారిపడ్డాడు. చప్పుడుతో షోయబ్ నేలపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనపై అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
తెల్లవారుజామున 3 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్న తల్లిదండ్రులు షోయబ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. షోయబ్ తండ్రి షౌకత్ అలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.