
భద్రాద్రి కొత్తగూడెం : ఒక Love couple పరారీకి సహకరించారంటూ.. ఆ ఊరి సర్పంచ్ ముగ్గురు యువకులను కొట్టాడు. వారిలో ఒక యువకుడు మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. bhadradri kothagudem జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో జరిగిన ఈ సంఘటనపై మృతుడి Selfie video, అతడి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం గండిగూడెం గ్రామానికి చెందిన దుర్గ భవాని శంకర్ (19) నారంవారిగూడెంలోని అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు.
వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన ఒక ప్రేమ జంట ఈ ఆదివారం గ్రామం నుంచి వెళ్ళిపోయింది. ఆ జంటకు ఐదుగురు యువకులు సహకరించారని గ్రామ సర్పంచి ముదిగొండ వెంకట ముత్యం భావించారు. వారిలో భవాని శంకర్, ముత్యాలరావు, వేముల నాగరాజులరె ఆదివారం పంచాయతీ కార్యాలయానికి పిలిపించి కొట్టారు. ప్రేమజంట ఆచూకీ చెప్పకుంటే చంపేస్తానని బెదిరించి సాయంత్రం వదిలేశారని చెబుతున్నారు. ఇంటికి వెళ్ళాక భవాని శంకర్ మనస్థాపంతో కలుపు మందు తాగడంతో అతడిని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల తర్వాత పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో ప్రాణాలు విడిచాడు.
అందరి ఎదుట సర్పంచ్ కొట్టాడన్న బాధతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు భవాని శంకర్ తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ అయింది. అతడు మృతితో ఆగ్రహించిన కుటుంబీకులు, బంధువులు మృతదేహంతో అశ్వరావుపేట పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు. కేసు నమోదు చేశామని, సర్పంచ్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్సై అరుణ తెలిపారు.
నేను ఎవరినీ కొట్టలేదు.. సర్పంచ్
ఈ ఘటనపై సర్పంచ్ వెంకట ముత్యం మాట్లాడుతూ తాను ఎవరినీ కొట్టలేదని బాలికను ప్రేమపేరుతో ప్రోత్సహించడం సరికాదని మాత్రమే చెప్పానన్నారు. భవాని శంకర్ ను కుటుంబీకుల మందలించడం వల్లే ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని.. అతడిని తన వాహనంలోనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపాడు.
కాగా, హైదరాబాద్ లో ఒకేరోజు తల్లీకొడుకులు బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో నష్టం రావడంతో మొదట సందీప్ ఉరివేసుకున్నాడు. దాన్ని తట్టుకోలేక తల్లి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగి సుమారు మూడు రోజులే ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నగరానికి చెందిన పీ వరప్రసాద్ భార్య సరళ, కుమారుడు సందీప్ హైదరాబాదులోని కేపీహెచ్ బి ఠాణా పరిధిలోని బృందావన్ కాలనీ రిషి కళ్యాణి రెసిడెన్సీ లో నివాసం ఉంటున్నారు. సరళ గృహిణి, కాగా సందీప్ వ్యాపారి.
సోమవారం ఉదయం వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చిన కుటుంబం స్నేహితులు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటం గమనించారు. కర్నూలులో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మాదాపూర్లో ఉంటున్న సరళ సోదరుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెట్రోలింగ్ పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా సరళ(59) వంటగదిలో, సందీప్ (35) పడక గదిలో ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించలేని విధంగా మారాయి. వాటిని తరలించేందుకు పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. వాచ్ మెన్ కు గురువారం సాయంత్రం సందీప్ అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చులు ఇచ్చాడు. అప్పటి నుంచి తల్లి, కుమారుడు ఇంటి నుంచి బయటకు రాలేదు. వరప్రసాద్ కర్నూలులో రైసుమిల్లు నడుపుతున్నారు.