ఈ ఏడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. 503 పోస్టులకు గాను 3,80,202 మంది అభ్యర్ధులు ధరఖాస్తులు చేసుకున్నారు.
హైదరాబాద్: Group-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది అక్టోబర్ 16న నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 పరీక్షలకు భారీగా అభ్యర్ధులు ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ పోస్టులను భర్తీ చేయనుంది TSPSC. రాష్ట్రంలోని గ్రూప్-1 కింద 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 756 మంది పోటీపడుతున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.
గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225ను రిజర్వ్ చేసింది. మహిళా అభ్యర్ధులు 1,51,192 మంది ధరఖాస్తు చేశారు. మహిళల్లో ఒక్క పోస్టుకు 672 మంది పోటీ పడుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 26న గ్రూప్ 1 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇదే. మే 2 నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ నెల 4 వతేదీవరకు ధరకాస్తులను స్వీకరించారు. డిప్యూటీ కలెక్టర్లు - 42,డీఎస్పీ - 91,సీటీవో - 48,ఎంపీడీవో - 121,కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ - 48,రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ - 04,జిల్లా పంచాయత్ ఆఫీసర్ - 05,జిల్లా రిజిస్ట్రార్ - 05,అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - 26,మున్సిపల్ కమీషనర్లు - 41,అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు : 40 పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇంటర్వ్యూను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తొమ్మిది నెలల్లోనే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసి పోస్టింగ్ లు ఇవ్వాలని కూడా కమిషన్ భావిస్తుంది. 900 మార్కుల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. గతంలో గ్రూప్ -1 కేటగిరిలో లేని విభాగాల పోస్టులను ఈ దఫా గ్రూప్ 1 లో చేర్చారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారంగా రాష్ట్ర కేడర్ పోస్టులు మల్టీ జోనల్ స్థాయికి మారాయి.
also read:గ్రూప్-1వయోపరిమితి పెంపు అభ్యర్థనలను పరిశీలించండి: తెలంగాణ హైకోర్టు
ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు తొలి విడతగా 30,453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల మరో 3,334 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3,334 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మిగతా శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
ఉర్తూలో కూడా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉర్దూలో కూడా ఈ పరీక్షలు రాసేందుకు అనుమతివ్వడంపై బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.