భార్యతో అక్రమసంబంధం.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి, రాడ్ తో తలమీద బాది..

Published : Oct 07, 2021, 09:37 AM ISTUpdated : Oct 07, 2021, 09:38 AM IST
భార్యతో అక్రమసంబంధం.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి, రాడ్ తో తలమీద బాది..

సారాంశం

అలాంటి ఘటనే కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింగ్ రావు కథనం మేరకు.. కూకట్ పల్లి కైత్లాపూర్ లో ఉంటున్న శ్రీకాంత్ (25), శ్రీశైలం సమీప బంధువులు, వీరిద్దరూ పాల వ్యాపారం చేసేవారు.

హైదరాబాద్ : వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని హత్య చేసి చెట్ల పొదల్లో పారవేశారు. ఇలాంటి సంబంధాలు చివరికి క్రైంతోనే అంతమవుతాయని తెలిసినా, క్షణికావేశంలో.. కోరికను అణుచుకోలేక..పట్టుకున్నప్పుడు కదా అనే ధీమాతో.. ఎలా తెలుస్తుంది అనే భ్రమలో.. చాలామంది ఇలాంటి అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపుతారు. చివరికి నిందితులుగానో, మృతులుగానో తేలుతారు. 

అలాంటి ఘటనే కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింగ్ రావు కథనం మేరకు.. కూకట్ పల్లి కైత్లాపూర్ లో ఉంటున్న శ్రీకాంత్ (25), శ్రీశైలం సమీప బంధువులు, వీరిద్దరూ పాల వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో శ్రీకాంత్ తరచుగా శ్రీశైలం ఇంటికి వచ్చేవాడు. అలా అతని భార్యతో పరిచయం ఏర్పడింది. 

శ్రీకాంత్ అదృశ్యం కావడంతో అతని కటుుంబ సభ్యులు ఈ నెల 2న కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 1వ తేదీన శ్రీశైలం, శ్రీకాంత్ ఇద్దరూ కైత్లాపూర్ లో టీ తాగిన తరువాత నడుచుకుంటూ వైన్ షాప్ సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లారు. 

ఆ సమయంలో శ్రీశైలం.. శ్రీకాంత్ ను రాడ్ తో తల మీద మోదాడు. అప్పటికి శ్రీకాంత్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో మరోసారి దాడి చేసి హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని చెట్ల పొదల్లోని ఓ గుంతలో పడేసి వెళ్లిపోయాడు. శ్రీశైలం భార్యతో extramarital affair ఉండడంతో ఎలాగైనా శ్రీకాంత్ ను మట్టు పెట్టాలన్న ఉద్దేశంతోనే అతడిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి murder చేశాడు. అయితే శ్రీకాంత్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బతుకమ్మల మీదినుంచి దూసుకెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు, ఉద్రిక్తత..

శ్రీశైలం మీద అనుమానం కూడా వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. దర్యాప్తులో తన భార్యతో illegal relation పెట్టుకున్నాడనే ఉద్దేశంతోనే శ్రీకాంత్ ను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. 

దీంతో నిందితుడిని హత్య చేసిన ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Flood Alert : తెలంగాణకు పొంచివున్న వరద ముప్పు... ఆస్తి, ప్రాణనష్టం తప్పదా?
భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు | Bonalu 2026 | Asianet News Telugu