యువతిని పెళ్లి చేసుకొంటానని షాకిచ్చిన ప్రియుడు, ఆమె ఏం చేసిందంటే?

Published : Sep 16, 2018, 05:25 PM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
యువతిని పెళ్లి చేసుకొంటానని షాకిచ్చిన ప్రియుడు, ఆమె ఏం చేసిందంటే?

సారాంశం

ప్రేమించానని నమ్మించి మోసం చేశాడు. ప్రేమ పేరుతో యువతిపై  మోజు తీరాక  నీవేవరో తెలియదన్నాడు. దీంతో  బాధితురాలు  పోలీసులను ఆశ్రయించింది. 


హైదరాబాద్: ప్రేమించానని నమ్మించి మోసం చేశాడు. ప్రేమ పేరుతో యువతిపై  మోజు తీరాక  నీవేవరో తెలియదన్నాడు. దీంతో  బాధితురాలు  పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు  నిందితుడిని అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్‌ దిల్‌సుఖ్ నగర్ లోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో 26 ఏళ్ల యువతి ఉంటుంది. 2017 జనవరి 6వ తేదీన  దిల్‌సుఖ్ నగర్ లో ప్రారంభమైన  షోరూమ్ లో  ఆ యువతికి ఫ్రాంక్లీన్ అనే యువకుడు పరిచయమయ్యాడు.

ఈ పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది.దీంతో 2017 జూలై5వ తేదీన ఆ యువతిని తీసుకొని భద్రాచలం వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం  అదే ఏడాది ఆగష్టు 31వతేదీన కేపీహెచ్‌బీ కాలనీలోని తన స్నేహితుడి ఇంటికి ఆ యువతిని తీసుకెళ్లాడు.

తాము పెళ్లి చేసుకొన్నామని  రెండు రోజుల పాటు అక్కడే ఉంటామని  చెప్పి స్నేహితుడి రూమ్ లో ఆమెపై  అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆర్టీసీ డీజీల్ మెకానిక్ గా గిద్దలూరులో ఫ్రాంక్లీన్ కు ఉద్యోగం వచ్చింది.  దీంతో అతను హైద్రాబాద్ నుండి గిద్దలూరు వెళ్లిపోయాడు.

అయితే  ఆ యువతికి గర్భం వచ్చింది. ఈ విషయం తెలిసిన ఆ యువతి వెంటనే  ఆ  యువకుడిని పెళ్లి చేసుకొందామని అడిగింది. అయితే పెళ్లికి అతను తిరస్కరించాడు.  దీంతో బాధిత యువతి మలక్ పేట పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే