ఆసుపత్రి నిర్వాకం: మహిళ ప్రాణం తీసిన డెలీవరీ

By narsimha lodeFirst Published Oct 22, 2018, 2:15 PM IST
Highlights

హైద్రాబాద్‌లోని వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో  ఓ మహిళ మృతి చెందింది.డెలీవరీ కోసం వచ్చిన మహిళకు ఒక పేగుకు బదులుగా మరో పేగును కట్ చేయడంతో మృతి చెందిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 


హైదరాబాద్: హైద్రాబాద్‌లోని వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో  ఓ మహిళ మృతి చెందింది.డెలీవరీ కోసం వచ్చిన మహిళకు ఒక పేగుకు బదులుగా మరో పేగును కట్ చేయడంతో మృతి చెందిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం నాడు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

హైద్రాబాద్‌లోని వనస్థలిపురంలోని  ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మహిళ డెలీవరీ కోసం చేరింది.  ఈ ఏడాది ఆగష్టు 15వ తేదీన డెలీవరీ సమయంలో ఒక పేగుకు బదులుగా మరో పేగును డాక్టర్ కత్తిరించాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆసుపత్రి నుండి డిశ్చార్జీ అయిన తర్వాత  బాధితురాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో తిరిగి ఆమెను  ఆసుపత్రికి తీసుకొచ్చారు. జీర్ణమైన ఆహారం బయటకు వెళ్లే పేగును  కట్ చేసినట్టు బాధితురాలి కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకొచ్చారు.

 

దీంతో ఆమెను తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున బాధితురాలు మృతి చెందిందని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో సోమవారం నాడు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. 

అసలు విషయం చెప్పకుండా .డైట్ తక్కువ తీసుకోవాలని  వైద్యులు సూచించారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ఆరువారాల పాటు భోజనం చేయకూడదని కేవలం పాలు మాత్రమే ఇవ్వాలని చెప్పారని.... కానీ, మల విసర్జనలో తీవ్ర సమస్యలతో  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయిందని బాధితులు చెబుతున్నారు.  నిర్లక్ష్యంగా  ఆపరేషన్ నిర్వహించిన  డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని  బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

click me!