ప్రాణంగా ప్రేమించిన ప్రియుడి చేతిలో మోసపోయి... నిజామాబాద్ యువతి సూసైడ్

Published : Apr 02, 2023, 01:04 PM ISTUpdated : Apr 02, 2023, 01:06 PM IST
ప్రాణంగా ప్రేమించిన ప్రియుడి చేతిలో మోసపోయి... నిజామాబాద్ యువతి సూసైడ్

సారాంశం

ప్రియుడి వేధింపులు భరించలేక మనస్థాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

నిజామాబాద్ : ప్రియుడి చేతిలో మోసపోయిన యువతి అతడికి దూరంగా వుండాలని నిర్ణయించుకుంది. కానీ అతడు మాత్రం ఆమెను వదిలిపెట్టుకుండా వేధింపులకు దిగాడు. ఇలా ప్రాణంగా ప్రేమించినవాడే వేధింపులకు దిగడాన్ని తట్టుకోలేకపోయిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్ భండార్ తండాకు చెందిన రాజేశ్వరి(19) అదే తండాకు చెందిన యువకుడు అభిలాష్ కొన్నేళ్ళపాటు ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల అభిలాష్ మరో యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని రాజేశ్వరికి తెలిసింది. దీంతో అతడితో గొడవపడి ఇకపై దూరంగా వుండాలని నిర్ణయించుకుంది. 

Read More  శ్రీకాళహస్తిలో కీచక బస్ డ్రైవర్.. ఆరో తరగతి బాలికతో అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి లైంగిక వేధింపులు..

ప్రియుడికి దూరంగా వుండేందుకు హైదరాబాద్ కు వెళ్లి ఓ జువెల్లరీ షాప్ పనికి కుదిరింది రాజేశ్వరి. కానీ తనను వదిలి వెళ్లిపోయిన ప్రియురాలిపై కోపాన్ని పెంచుకున్న అభిలాష్ ఫోన్ చేసి వేధించడం ప్రారంభించాడు. అసభ్యంగా మాట్లాడుతూ నిత్యం వేధిస్తుండటంతో భరించలేకపోయిన రాజేశ్వరి ఇటీవల తండాకు వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూలేని సమయంలో రాజేశ్వరి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

ప్రాణాపాయస్థితిలో వున్న రాజేశ్వరిని కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. పరిస్ధితి విషమించడంతో శనివారం రాజేశ్వరి మృతిచెందింది. దీంతో యువతి కుటుంబసభ్యులు, బంధువులు మృతికి కారణమైన అభిలాష్ ఇంటిపై దాడిచేసారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అభిలాష్ ను అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్