శారీరకంగా వాడుకుని ప్రభుత్వోద్యోగం రాగానే వదిలేస్తాడట..: ప్రియుడి ఇంటిముందు యువతి ధర్నా (వీడియో)

Published : Jun 28, 2023, 01:05 PM ISTUpdated : Jun 28, 2023, 01:11 PM IST
శారీరకంగా వాడుకుని ప్రభుత్వోద్యోగం రాగానే వదిలేస్తాడట..: ప్రియుడి ఇంటిముందు యువతి ధర్నా (వీడియో)

సారాంశం

పన్నేండేళ్లుగా ప్రేమించినవాడు మరో యువతితో పెళ్లికి సిద్దమవడంతో తీవ్ర మనోవేదనకు గురయిన అతడి ఇంటిముందు ఆందోళనకు దిగింది. 

పెద్దపల్లి : వారిద్దరూ పన్నెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎలాగూ పెళ్లిచేసుకుని జీవితాంతం కలిసివుంటాం కదా అని శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఏళ్లుగా ప్రేమించిన ప్రియురాలిని మోసం చేస్తూ అతడు మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. విషయం తెలిసిన యువతి న్యాయం కోసం ప్రియుడి ఇంటిముందు కూర్చుని ఆందోళనకు దిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. 

బాధిత యువతి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూరు గ్రామానికి చెందిన శంకర్ పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సరితతో ప్రేమాయణం సాగించాడు. గత పన్నెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

ఒకరంటే ఒకరికి ఇష్టపడి ప్రేమించుకుంటున్న శంకర్, సరిత పెళ్లి కూడా చేసుకోవాలని బావించారు. దీంతో పెళ్లికి ముందే శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. అవసరం వుందని అడిగిన ప్రతిసారీ  డబ్బులు కూడా ఇచ్చినట్లు సరిత చెబుతోంది. ఉద్యోగాలు సాధించాక పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకోవాలని అనుకున్నామని యువతి తెలిపింది. ఇంతలోనే ప్రియుడు తనను మోసం చేసి మరో యువతిని పెళ్ళాడేందుకు సిద్దపడ్డాడంటూ యువతి బోరున విలపిస్తూ తెలిపింది. 

Read More  ఆటోడ్రైవర్ తో వివాహేతర సంబంధం.. భర్త గొంతునులిమి చంపిన భార్య..

మూడేళ్ల క్రితం శంకర్ కు పంచాయితీ సెక్రటరీ ఉద్యోగం రావడంతో తనను దూరంపెట్టడం ప్రారంభించాడని ప్రియురాలు సరిత తెలిపింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి ప్రియుడు కట్నం కోసం పెద్దలు కుదిర్చిన మరో యువతితో పెళ్లికి సిద్దమై నిశ్చితార్థం కూడా చేసుకున్నాడని సరిత తెలిపింది. దీంతో న్యాయం కోసం అతడి ఇంటిముందు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని బాధిత యువతి వెల్లడించింది. 

వీడియో

ప్రియుడి చేతిలో మోసపోయి చిన్నబొంకూరులో అతడి ఇంటిముందు కుటుంబంతో కలిసి నిరసనకు దిగిన సరితకు మహిళాసంఘాలు మద్దతు పలికాయి. సరితకు న్యాయం జరిగేవరకు అండగా వుంటామని మహిళా సంఘం నాయకురాలు రామలక్ష్మి తెలిపాయి. తనకు శంకర్ తో వివాహం జరపాలని... లేదంటే ఆత్మహత్యే దిక్కని సరిత అంటోంది. 


 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్