హుస్సేన్ సాగర్ లో తేలియాడుతూ యువతి మృతదేహం..

By Arun Kumar P  |  First Published May 2, 2023, 5:14 PM IST

హుస్సేన్ సాగర్ జలాల్లో ఓ యువతి మృతదేహం తేలియాడుతూ బయటపడింది. 


హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున గల హుస్సేన్ సాగర్ జలాశయంలో యువతి మృతదేహం బయటపడింది. లేక్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సాగర్ జలాల్లో యువతి మృతదేహం తేలుతూ కనిపించింది. దీంతో డిఆర్ఎస్ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ హాస్పిటల్ కు మార్చురీకి తరలించారు. మృతిచెందిన యువతి వివరాలు తెలియాల్సి వుంది.

మృతిచెందిన యువతి వయసు 25-30 ఏళ్ల మధ్య వుంటుందని...  ఎరుపురంగు ప్యాంట్, క్రీం కలర్ టాప్ ధరించి వుందని తెలిపారు. యువతి వివరాలు తెలిసినవారు తమను సంప్రదించాలని రాంగోపాల్ పేట పోలీసులు తెలిపారు. 

Latest Videos

Read More  షాద్‌నగర్ లో దారుణం: రోడ్డు పక్కనే మూటలో మహిళ డెడ్ బాడీ

ఇదిలావుంటే హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నీటి గుంత చిన్నారి బాలుడిని బలితీసుకుంది. రెండో తరగతి చదువుకునే బాలుడు వేసవి సెలవుల్లో ఇంటివద్దే వుంటున్నాడు. తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటూ బాలుడు నీటిగుంతలో పడిపోయాడు.  వెంటనే అతనితోపాటు ఆడుకుంటున్న పిల్లలు సమాచారాన్ని షోరూంలో ఉన్నవారికి చెప్పగా.. వారు వచ్చి తీసేసరికి అప్పటికే బాలుడు మరణించాడు. పనిపై బయటకు వెళ్లిన బాలుడు తల్లిదండ్రులు విషయం తెలిసి హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. వెళ్లేటపుడు నవ్వుతూ కనిపించిన కొడుకు విగతజీవిగా కనిపించడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. 
 

click me!