గోదావరిలో ఈతకు వెళ్లి... నలుగురు యువకులు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Arun Kumar P   | Asianet News
Published : Mar 19, 2021, 03:08 PM IST
గోదావరిలో ఈతకు వెళ్లి... నలుగురు యువకులు మృతి, మరొకరి పరిస్థితి విషమం

సారాంశం

 ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో ఐదుగురు స్నేహితులు గోదావరి నదిలో ఈతకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో ఐదుగురు స్నేహితులు గోదావరి నదిలో ఈతకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఇప్పటికే ముగ్గురు  మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా వుంది. మరో యువకుడి మృతదేహం నదిలో గల్లంతయ్యింది. అతడు కూడా ఇప్పటికే మరణించి వుంటాడని తెలుస్తోంది. ప్రాణాపాయ స్థితిలో వున్న యువకుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 

ఇలా ప్రమాదానికి గురయిన యువకులది భద్రాచలం పట్టణంలోని అయ్యప్ప కాలనీగా తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో గల్లంతయిన యువకుడి కోసం నదిలో గాలింపు చేపట్టారు. అలాగే ముగ్గురు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన యువకులు వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యువకుల వివరాలు తెలుసుని వారి కుటుంబసభ్యులను ఈ విషాదం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu