రంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం... యువకుడితో పాటు ఆర్ఎంపి, మహిళా డాక్టర్ అరెస్ట్

Arun Kumar P   | Asianet News
Published : Sep 29, 2021, 12:12 PM IST
రంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం... యువకుడితో పాటు ఆర్ఎంపి, మహిళా డాక్టర్ అరెస్ట్

సారాంశం

ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ గిరిజన బాలికను లోబర్చుకుని గర్భవతి చేయడమే కాదు... గుట్టుగా అబార్షర్ చేయించిన ఓ యువకుడిని రంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

రంగారెడ్డి: మాయమాటలతో గిరిజన బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. ఇలా లైంగికదాడికి గురయిన యువతి గర్భం దాల్చడంతో అబార్షన్ కూడా చేయించాడు. అయితే తాజాగా ఈ వ్యవహారమంతా బయటపడి యువకుడు కటకటాలపాలయ్యాడు. అతడికి సహరించిన ఇద్దరు డాక్టర్లు కూడా జైలుపాలయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన బాలిక(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే తండాకు చెందిన వివాహితుడు రవీందర్(21) కన్ను బాలికపై పడింది. ప్రేమిస్తున్నానంటూ కొంతకాలం వెంటపడటంతో బాలిక అతన్ని నమ్మింది. దీంతో బాలికపై అతడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.  

read more  ఆదిలాాబాద్: ప్రేమ పేరిట మోసం... పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

రవీందర్ తరచూ లైంగికవాంఛ తీర్చుకోవడంతో బాలిక గర్భం దాల్చింది. దీంతో తనకు తెలిసిన ఓ ఆర్ఎంపీ సాయంతో హైదరాబాద్ లో ఓ డాక్టర్ ను సంప్రదించి బాలికకు గుట్టుగా అబార్షన్ చేయించాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు రవీందర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో బాలికను మోసగించి గర్భవతిని చేసిన నిందితుడితో పాటు అతడికి సహకరించి ఆర్ఎంపీ, అబార్షన్ చేసిన ఎంబిబిఎస్ డాక్టర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu