ఆదిలాాబాద్: ప్రేమ పేరిట మోసం... పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Sep 29, 2021, 11:28 AM IST
ఆదిలాాబాద్: ప్రేమ పేరిట మోసం... పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

సారాంశం

ప్రాణంగా ప్రేమించినవాడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయని యువతి ఆత్మహత్య చేసుకున్న విషాదం ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఆదిలాబాద్: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మరస్తాపానికి గురయింది ఓ యువతి. ప్రేమించిన వాడిన వదిలి బ్రతకలేక చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.   

వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన మర్సకోల లచ్చులు-శోభ దంపతులు పెద్ద కూతురు జంగుబాయి(18). ఈమెకు జైనథ్ మండలానికి చెందిన రవితో పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరి ప్రేమ కొంతకాలం సాఫీగా సాగింది. అయితే యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో రవి ఇద్దరిమద్య దూరం పెరిగింది. 

read more  ఒకే యువకుడితో.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు పరార్..!

ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించడాన్ని యువతి తట్టుకోలేకపోయింది. ప్రేమించివాడితోనే జీవితాన్ని పంచుకోవాలన్న యువతి ఆశలపై ప్రియుడే నీళ్లు చల్లడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. దీంతో గత శనివారం(సెప్టెంబర్ 25) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది జంగుబాయి. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. 

గత మూడు నాలుగు రోజులుగా రిమ్స్ లో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్యం మరింత క్షీణించి మంగళవారం మృతి చెందింది. దీంతో యువతి తల్లిదండ్రులు తమ కూతురి మరణానికి రవి ప్రేమపేరుతో నమ్మించి మోసం చేయడమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు