గాంధీభవన్‌కు చేరుకున్న ఎల్లారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ.. అనుచరులతో కలిసి సుభాష్ రెడ్డి ధర్నా

Published : Jun 25, 2022, 02:14 PM IST
గాంధీభవన్‌కు చేరుకున్న ఎల్లారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ.. అనుచరులతో కలిసి సుభాష్ రెడ్డి ధర్నా

సారాంశం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి‌ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పంచాయితీ గాంధీభవన్‌కు చేరకుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ సుభాష్ రెడ్డి.. తన అనుచరులతో కలిసి నేడు గాంధీభవన్‌లో ధర్నా చేశారు. మదన్ మోహన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి‌ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పంచాయితీ గాంధీభవన్‌కు చేరకుంది. గతకొంతకాలంగా ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో వర్గపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ సుభాష్ రెడ్డి, పీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్‌మోహన్ రావు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గత కొంతలంగా ఇరువర్గాల మధ్య సాగుతున్న ఈ విబేధాలు నిన్న తారాస్థాయికి చేరుకున్నాయి. 

ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం రాజంపేట మండ‌లంలో మదన్ మోహన్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న సుభాష్ రెడ్డి వర్గీయులు.. మదన్ మోహన్ టీఆర్ఎస్ కోవర్టుగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి.. ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇందులో పలువురికి గాయాలు అయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు పోలీసులు స్టేషన్‌లో ఒకరిపై మరోకరు ఫిర్యదు చేసుకున్నారు. ఇక, సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ ఇద్దరు కూడా రానున్న ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో నిలవాలని భావిస్తున్నారు. 

నిన్న చోటుచేసుకున్న పరిణామాల అనంతరం.. నేడు ఎల్లారెడ్డి పంచాయితీ గాంధీ భవన్‌కు చేరకుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ సుభాష్ రెడ్డి.. తన అనుచరులతో కలిసి ధర్నా చేశారు. మదన్ మోహన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మదన్ మోహన్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని సుభాష్ ఆరోపణలు చేశారు. ఆయన కాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్యనేతలను కలిసే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu