
తెలంగాణలో ఉపాధ్యాయులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా టీచర్లు ఆస్తి వివరాలు సబ్మిట్ చేయాల్సిందేనని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని తెలుగు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఆ కథనాల ప్రకారం.. స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్న ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని విద్యాశాఖ చెప్పింది. టీచర్లందరూ వార్షిక ప్రాపర్టీ స్టేట్‌మెంట్‌ను విద్యాశాఖకు సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి టీచర్లు, ఉద్యోగులకు ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలని ఆర్జేడీ, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లాలో ఓ టీచర్ వ్యవహారంతో విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.