నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వైసీపీ పోటీ..!

Published : Mar 26, 2021, 10:27 AM ISTUpdated : Mar 26, 2021, 10:30 AM IST
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వైసీపీ పోటీ..!

సారాంశం

రోజు రోజుకీ ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఇలాంటి సమయంలో వైసీపీ ఈ ఎన్నికల్లో భాగం కావడం గమనార్హం

వైసీపీ అనగానే.. ఎవరైనా అది ఆంధ్రా పార్టీ అని చెప్పేస్తారు. ఎందుకంటే.. తెలంగాణలో ఆ పార్టీ ఛాయలు ఎక్కడా లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితమైంది. అక్కడే శ్రమించి.. అధికారం కూడా చేజిక్కించుకుంది. అయితే.. అనూహ్యంగా ఈ పార్టీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో అడుగుపెట్టింది.

త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇక్కడి అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. రోజు రోజుకీ ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఇలాంటి సమయంలో వైసీపీ ఈ ఎన్నికల్లో భాగం కావడం గమనార్హం. వైసీపీ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆంధ్రప్రభ కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం వరకు నాగార్జున సాగర్ ఉపఎన్నికల కోసం మొత్తం 13 నామినేషన్లు దాఖలయినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అందులో 12 ఇండిపెండెంట్లు కాగా..మరొకరు వైసీపీ అభ్యర్థి అని వెల్లడించారు. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య కొన్నేళ్లుగా స్నేహ బంధం కొనసాగుతోంది. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా నేరుగా పోటీ చేకుండా.. వైసీపీ మద్దతు ఇస్తోందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కానీ అనూహ్యంగా సాగర్ ఉపఎన్నికల్లో వైసీసీ అభ్యర్థి నామినేషన్ వేయడం చర్చనీయాంశమయింది. టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చేందుకే వైసీీపీ ఈ నిర్ణయం తీసుకుందని కొందరు చెబితే.. ఓట్లను చీల్చి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చేందుకు గేమ్ ఆడుతున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?