అత్తగారింట్లో ఉన్న కూతుర్ని తీసుకొచ్చి.. ఉరేసి.. ఆత్మహత్య.. !!

By AN TeluguFirst Published Mar 26, 2021, 9:43 AM IST
Highlights

మంచిర్యాలలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పులు తీర్చలేక తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని రాసిన సూసైడ్ సూసైడ్ లేఖలోని విషయాలు అందర్నీ కదిలిస్తున్నాయి. 

మంచిర్యాలలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పులు తీర్చలేక తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని రాసిన సూసైడ్ సూసైడ్ లేఖలోని విషయాలు అందర్నీ కదిలిస్తున్నాయి. 

వివరాల్లోకి వెడితే.. అప్పుల బాధకు చచ్చిపోవాలని నిర్ణయించుకున్న మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లికి చెందిన 45 ఏళ్ల కౌలు రైతు జంజిరాల రమేష్ రెండు రోజుల ముందు..  ఏడాది క్రితం పెళ్లి చేసిన తన కూతుర్ని అత్తగారింటినుంచి తీసుకొచ్చాడు. ఆ రెండ్రోజులూ కూతురితో సంతోషంగా గడిపారు. ఆ తరువాత బుధవారం రాత్రి తాము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామన కూతురికి చెప్పాడు. మీతోనే కలిసి చచ్చిపోతానని, మీరు లేకపోతే బతకలేనని కూతురు చెప్పింది. 

దీంతో నలుగురు కలిసే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. దీంతో ముందు కొడుకు, కూతురికి ఉరి వేసి.. ఆ తర్వాత తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయం ఇంట్లోకి ఎవరూ బైటికి రాకపోవడంతో పక్కింటి వాళ్లు వచ్చిచూస్తే జరిగిన ఘోరం బయటపడింది.

సూసైడ్ నోట్ లో ‘నాకు తెలివి ఉంది.. కానీ పైసా మాత్రం లేదు. అప్పులోళ్లకు మార్చి 25న బాకీ తీరుస్తానని వాయిదా పెట్టాను. వాళ్లు వచ్చి అడిగితే ఏం చెప్పాలి. ఈ మధ్య తరగతి వాళ్లకు ఇజ్జత్ ఎక్కువ. నలుగురి ముందు ఇజ్జత్ పోతే బతకలేం. నాకే గనక ఎకరం పొలం ఉంటే దాన్ని అమ్మైనా బతికేటోళ్లం. 

ఇప్పుడు ఇల్లు అమ్మితే పది లక్సలు వస్తాయి.. కానీ ఇంకా 8 లక్షలవరకు బాకీ ఉంటుంది. ఈ ఎనిమిది లక్సల అప్పులు తీర్చలేకే మా నాలుగు ప్రాణాలు పోతున్నాయి.. 30 ఎకరాల పత్తి వేస్తే వంద క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కైకిళ్లన్నీ పోనూ 3 లక్షలే మిగిలాయి. పోయిన ఏడాది నష్టపోయా.. ఈ సారి అదే పరిస్థితి.. బిడ్డ పెళ్లికి కూడా అప్పులయ్యాయి. మా ఆత్మహత్యలకు ఎవరూ కారణం కాదు.. కౌలు రైతు పరిస్థితి ఇంతే.. నా పిల్లలు బతికి ఉన్నా, అప్పులోళ్లు వాళ్లను అడుగుతుంటారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటూ రాసుకొచ్చాడు. 

ఆ రైతు అల్లుడు మాట్లాడుతూ.. ఈ నెల 13వ తేదీనే మా మొదటి పెళ్లి రోజు. ఘనంగా జరుపుకున్నాం. ఇంతలోనే నా భార్య ఇంత దారుణానికి ఒడిగట్టింది. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు.. నన్నొదిలేసి ఎలా వెళ్లావ్ అంటూ సౌమ్య భర్త కన్నీరుమున్నీరవుతున్నాడు. 

 తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం మల్కేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 

కొడుకుకి, కూతురికి తొలుత విషమిచ్చి చంపి భార్యాభర్తలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రమేష్, పద్మ దంపతులు తమ కుమారుడు అక్షయ్, సౌమ్యలకు తొలుత విషమిచ్చి చంపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారు ఆత్మహత్య చేసుకున్నారు. 

సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభించింది. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాశారు. ఏడు లక్షల రూపాయలకు పైగా అప్పులు కావడంతో వాటిని చెల్లించే తాహతు లేక మరణిస్తున్నట్లు అందులో రాసినట్లు తెలుస్తోంది.

రమేష్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు సౌమ్యకు అతను వివాహం చేసినట్లు తెలుస్తోంది. అయితే, లాక్ డౌన్ కారణంగా కొద్ది రోజుల క్రితం ఆమె పుట్టింటికి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 

click me!