కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపులో ఆరు సెం.మీ కత్తిగాటు పడిందని యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇవాళ రాత్రి యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
హైదరాబాద్: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపులో ఆరు సెం.మీ. కత్తిగాటు పడిందని యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.సోమవారంనాడు రాత్రి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ ను యశోద ఆసుపత్రి విడుదల చేసింది. కొత్త ప్రభాకర్ రెడ్డికి వైద్యం చేసిన వైద్యులు ఇవాళ రాత్రి మీడియాతో మాట్లాడారు.
కత్తి గాటు కారణంగా శరీరం లోపల బ్లీడింగ్ అవుతుందని గుర్తించినట్టుగా ఆయన చెప్పారు.చిన్నపేగుకు నాలుగు చోట్ల గాయం అయిందన్నారు.
చిన్న పేగు 15 సెం.మీ తొలగించి కుట్లు వేసినట్టుగా వైద్యులు తెలిపారు.
త్వరగా ఆసుపత్రికి చేరుకోవడంతో కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇన్ ఫెక్షన్ ముప్పు తప్పిందని వైద్యులు తెలిపారు. 10 రోజుల వరకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు చెప్పారు.
undefined
ఇవాళ సూరంపల్లిలో కొత్త ప్రభాకర్ రెడ్డిని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. ఈ సమయంలో ప్రభాకర్ రెడ్డి గన్ మెన్ ఈ దాడిని అడ్డుకున్నాడు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి దిగిన రాజుపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని తమిళిసై డీజీపీని ఆదేశించారు.
also read:యశోద ఆసుపత్రికి కేసీఆర్: కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన సీఎం
విపక్షాలు చేతకాక దాడులకు పాల్పడుతున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. తాము చేతులు ముడుచుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. తమకు తిక్కరేగితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు తన కాన్వాయ్ లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. గజ్వేల్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత వెంటనే ఆయనను యశోదకు తరలించారు. యశోద ఆసుపత్రిలో వైద్యులు ఆయనను పరీక్షించారు. శస్త్రచికిత్స చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కుటుంబ సభ్యుల అనుమతితో ఆపరేషన్ చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆపరేషన్ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆయనను పరామర్శించారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.