ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి షాక్: ఎస్ఐ‌ని తిట్టారని 'పట్నం'పై మరో కేసు

By narsimha lode  |  First Published Apr 28, 2022, 1:42 PM IST

మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై గురువారం నాడు మరో కేసు నమోదైంది. యాలాల ఎస్ఐను మహేందర్ రెడ్డి దూషించినందుకు ఈ కేసు పెట్టారు. ఇప్పటికే తాండూరు సీఐను దూషించినందుకు కేసు పెట్టిన విషయం తెలిసిందే



హైదరాబాద్: మాజీ మంత్రి, TRS ఎమ్మెల్సీ Patnam Mahender Reddy పై గురువారం నాడు  మరో Case నమోదైంది. Yalala ఎస్ఐ‌ని దూషించారని పట్నం మహేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇప్పటికే తాండూరు సీఐ Rajender Reddyని దూషించారని  ఎమ్మెల్సీపై కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన మరునాడే ఈ కేసు నమోదు కావడం గమనార్హం.

యాలాలలో ప్రభుత్వ కార్యక్రమంలో యాలాల ఎస్ఐపై కూడా పట్నం మహేందర్ రెడ్డి దూషించారు. రు.ఈ విషయమై యాలాల పోలీసు స్టేషన్ లో మహేందర్ రెడ్డిపై కేసు నమోదైంది.  

Latest Videos

undefined

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనపై అనుచితంగా వ్యవహరించారని యాలాల ఎస్ఐ అరవింద్ చెప్పారు. తీవ్ర పరుష పదజాలాన్ని తనపై  ఉపయోగించారని ఎస్ఐ మీడియాకు చెప్పారు.స్టేజీపై తనకు నచ్చని వాళ్లని కిందకు దించాలని తనను బూతులు తిట్టారని ఎస్ఐ అరవింద్ చెప్పారు.అరేయ్ ఎస్ఐ తమాషాలు చేస్తున్నావా అని తిట్టారన్నారు. పబ్లిక్ లో తిట్టడం తనకు అవమానకరంగా ఉందని అరవింద్ చెప్పారు.మహేందర్ రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానన్నారు.

ఈ నెల ఈ నెల 23న తాండూరులో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులతో కూర్చొన్నా కూడా సీఐ రాజేందర్ రెడ్డి వారించలేదనే ఆగ్రహంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి దూషించారనే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఆడియో ఆధారంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు  మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై  పోలీస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని  పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. మహేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది. 

అయితే తాండూరు సీఐతో పాటు రూరల్ సీఐతో తాను ఫోన్ లో మాట్లాడానని పట్నం మహేందర్ రెడ్డి మీడియాకు చెప్పారు. అయితే  తాను సీఐ రాజేందర్ రెడ్డిని దూషించలేదన్నారు. సీఐ రాజేందర్ రెడ్డిని దూసించినట్టుగా ున్న ఆడియో తనది కాదన్నారు. ఈ విషయమై తాను చట్టపరంగా ఎదుర్కొంటానని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు పోలీసులంటే గౌరవమని చెెప్పారు.  యాలాల ఎస్ఐ గా రాజేందర్ రెడ్డి పనిచేసన సమయంలో ఇలానే వ్యవహరించారన్నారు. 1994 నుండి తాను ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పారు.

. తాండూరు లో పనిచేసిన పోలీసులకు తానంటే ఏమిటో తెలుసునని మహేందర్ రెడ్డి వివరించారు.చట్టపరంగా తాను ఎదుర్కొంటానని పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ తరహా ఘటనల వెనుక స్థానిక  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే చుట్టూ రౌడీ షీటర్లున్నారని ఈ విషయాన్ని తాను సీఐని అడిగిినట్టుగా మహేందర్ రెడ్డి చెప్పారు. సీఐ రాజేందర్ రెడ్డిని దూషించిన  ముందు రోజే యాలాల ఎస్ఐని మహేందర్ రెడ్డి దూషించిన ఘటన చోటు చేసుకంది.

మరో వైపు తాండూరు సీఐ రాజేందర్ రెడ్డికి ెమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మద్దతు పలికారు. ఈ రకమైన వ్యాఖ్యలు మహేందర్ రెడ్డి చేయకూడదన్నారు. తాండూరు నుండే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు. తనకు మహేందర్ రెడ్డి పోటీయే కాదన్నారు. సర్వేల్లో తనకే అనుకూలంగా నివేదికలు వచ్చాయని రోహిత్ రెడ్డి చెప్పారు.

 

click me!