యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ..

Published : Mar 16, 2022, 12:26 PM IST
యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ..

సారాంశం

యాదాద్రిలో ప్రధానాలయ ఉద్ఠాటనకు అంతా సిద్ధం అయ్యింది. ఈ నెల 21నుంచి 28వరకు పాంరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహించనున్నారు. 

యాదాద్రి : Yadadri ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 28న ప్రధానాలయంలో Mahakumbha Samprokshan నిర్వహించనున్నారు. మిథునలగ్న సుముహూర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న సాయంత్రం ఆలయంలో శాంతి కల్యాణం చేపట్టనున్నారు. 21-28 వరకు పాంచరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహించనున్నారు. 

ఈ నెల 21న ఉదయం 9 గంటలకు విశ్వక్సేనుడికి తొలి పూజ చేయనున్నారు. స్వస్తిపుణ్యాహవచన మంత్ర పఠనాలతో ప్రధానాలయ ఉద్ఘాటన నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. వీటితో ాపటు 21 నుంచి వారంపాటు బాలాలయంలో పంచకుండాత్మక హోమం నిర్వహించనున్నారు. బాలాలయంలో ఉద్ఘాటన పూజల నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆర్టిజ సేవలు నిలిపివేయనున్నారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత సేవలు జరిపించుకోవాలని ఆలయ వర్గాలు సూచించాయి. 

ఇదిలా ఉండగా, తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్-కమల దంపతులు  యాదాద్రి ఆలయ విమాన గోపురానికి మంగళవారం నాడు కిలోన్నర బంగారాన్ని సమర్పించారు.ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తన వ్యక్తిగతంగా పావుకిలో(25 తులాలు) బంగారం, నియోజకవర్గ ప్రజల తరపున ఒక కిలో 33 తులాలు (మొత్తం 158 తులాల) బంగారాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కల కాలం ఉండాలని కోరుకున్నారు. గతంలో కులాన్ని, మతాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారని.. నిజమైన హిందువుగా సీఎం కేసీఆర్ తెలంగాణ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు.తెలంగాణ జాతిపిత, సీఎం కేసీఆర్ ఒక సంకల్పంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేందుకు ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించాలని నిర్ణయించి ఆదిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తెలిపారు. 

అటువంటి మహా ఆలయ విమాన గోపురాన్ని బంగారు తాపడంతో చేయాలని తలచి ఎవరికి వారుగా సహాయం చేయాలనే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మా తుంగతుర్తి నియోజకవర్గం ప్రజల తరుపున కేజీన్నర(158 తులాలు) బంగారాన్ని యాదాద్రి దేవస్థానానికి సమర్పించామని ఎమ్మెల్యే కిశోర్ కుమార్ వెల్లడించారు. ఈ మహత్తర కార్యక్రమంలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కిశోర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పై లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కల కాలం ఉండాలని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల తరుపున యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పేర్కొన్నారు.  

రకరకాలుగా మాట్లాడుతున్న నేతలు గతంలో కులాన్ని, మతాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారని.., దేవాదాయ శాఖ నుంచి నిధులను తీసుకున్నారు గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాలయాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. దేవాలయాల అభివృద్ధి విషయంలో గానీ, అర్చకులను పట్టించుకునే విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారని అన్నారు. నిజమైన హిందువుగా తెలంగాణ ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే సోయి ఉన్న నేతగా ఆయుత చండీయాగం చేసి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ పరితపించారని. నాటి నుంచి తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని, తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే కిశోర్ కుమార్ తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kondagattu పున‌ర్జ‌న్మ ఇచ్చింద‌ని Pawan Kalyan ఎందుక‌న్నారు? | Anjaneya Swamy | Asianet News Telugu
MLA Medipally Satyam Emotional Words: ఆంజనేయస్వామే పవన్ కళ్యాణ్ గారినికాపాడారు | Asianet News Telugu