యాదాద్రిలో శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా.. కారణం ఇదే..

Published : Feb 19, 2022, 10:35 AM IST
యాదాద్రిలో శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా.. కారణం ఇదే..

సారాంశం

యాదాద్రి (yadadri)  శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం (sri sudarshana narasimha maha yagam) వాయిదాపడింది. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.

యాదాద్రి (yadadri)  శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం (sri sudarshana narasimha maha yagam) వాయిదాపడింది. వచ్చే నెల 21 నుంచి నిర్వహించాలనుకున్న ఈ మహాయాగాన్ని వాయిదా వేస్తున్నట్టుగా యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు వెల్లడించారు. ఆలయ అభివృద్దిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తి కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకన్నట్టుగా చెప్పారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అయితే మూలవర్యుల దర్శనం మాత్రం గతంలో నిశ్చయించినట్టుగా మార్చి 28 నుంచే ఉండనుంది. 

మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ చేపట్టిన తర్వాత ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని ఆలయ అధికారులు చెప్పారు. ప్రస్తుతం నారసింహుడు కొలువై ఉన్న బాలాలయాన్ని మార్చి 27 వరకు కొనసాగిస్తారు. ఈ నెలాఖరులో ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాల స్థాపన జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక, అద్భుతంగా పునర్మితమైన యాదాద్రి దివ్యక్షేత్రం ప్రారంభం ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇక, శ్రీసుదర్శన నారసింహ మహాయాగం నిర్వహణకు సంబంధించిన మరో ముహుర్తం ఖరారు చేయనున్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ చేపట్టిన తర్వాత  నారహింహ మహాయాగం నిర్వహించే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu