సైబర్ దొంగగా మారిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు.. కోట్లు కొల్లగొట్టి పరార్...

Published : Feb 19, 2022, 09:47 AM IST
సైబర్ దొంగగా మారిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు.. కోట్లు కొల్లగొట్టి పరార్...

సారాంశం

వ్యక్తిత్వ వికాసం గురించి లెక్చర్లిచ్చే ఓ ప్రబుద్ధుడు.. జనాలకు కోట్ల రూపాయల్లో టోపీ పెట్టాడు. సైబర్ నేరస్తుడిగా మారి.. క్రిప్టో కరెన్సీ పేరుతో టోకరా వేశాడు. అందినకాడికి దోచుకుని అమెరికా చెక్కేశాడు. 

నారాయణగూడ : జీవితం అంటే ఏంటి?  పోటీ ప్రపంచాన్ని ఎలా గెలవాలి?  ఉన్నత స్థితికి ఎదిగేందుకు ఏం చేయాలి? వంటి అంశాలపై మాట్లాడుతూ ఆత్మస్థైర్యంనింపే Personality Development Specialist (మోటివేషనల్ స్పీకర్) కాస్త సైబర్ మోసగాడిగా అవతారమెత్తాడు. Cryptocurrency కొని తన ఖాతాకు బదిలీ చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు ఇస్తామని నమ్మించి.. కోట్లు కొల్లగొట్టి అమెరికాకు చెక్కేసాడు. అతనికి సహకరించిన ఆయన తండ్రి కూడా పారిపోయే ప్రయత్నంలో ఉండగా Cyber ​​police అరెస్టు చేశారు. 

సైబర్ క్రైమ్ ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్  శుక్రవారం వివరాలు వెల్లడించారు... ‘ముంబైకి చెందిన Hershel Patel మోటివేషనల్ స్పీకర్.  అవగాహన సదస్సుల్లో కొంతకాలంగా క్రిప్టోకరెన్సీ గురించి కూడా చెప్పడం మొదలుపెట్టాడు. రూ. లక్షల్లో crypto కొంటే రూ.కోట్లలో లాభాలు వచ్చేలా చూస్తా అని నమ్మించేవాడు. నమ్మిన వారితో క్రిప్టోకరెన్సీ కొనిపించి..  ఆ తరువాత దాన్ని తన ఖాతాలకు బదిలీ చేయించుకునేవాడు. ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాల వారి నుంచి కోట్లు కొల్లగొట్టాడు.  

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఒకరు నుంచి ఎనిమిది లక్షలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకరి నుంచి రూ.60 లక్షలు మరొకరు నుంచి రూ.30 లక్షలు కాజేసినట్లు విచారణలో గుర్తించాం.  హర్షల్ పటేల్ అమెరికాకు పారిపోయినట్లు  తెలుసుకున్నాం. నిందితుడి తండ్రి Madangir (70) పంజాబ్ లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళాం. ఆయన కూడా అమెరికాకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో మాటువేసి శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించాం’ అని ఏసీపీ తెలిపారు.

ఇదిలా ఉండగా, గండిపేట మండలం హైదర్షాకోట్ లోని Kasturba Gandhi national memorial Trust నుంచి 14 మంది women శుక్రవారం అర్థరాత్రి పరారయ్యారు. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని వివిధ పరిధిలో పట్టుబడిన యువతులు, మహిళలను పోలీసులు కస్తూర్బాగాంధీ స్మారక ట్రస్టులో చేర్చుతారు. భద్రత మధ్య ఒక hall లో 18 మందిని ఉంచారు. 

శుక్రవారం తెల్లవారుజామున 2గం.ల సమయంలో bathroomలో కిటికీ ఊచలు కట్ చేసి 15 మంది పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఒక యువతికి స్వల్పగాయం కావడంతో అక్కడే ఉండిపోయింది. మిగిలిన 14మంది పరారయ్యారు. ఉదయం గుర్తించిన మేనేజర్లు రామకృష్ణమూర్తి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పారిపోయిన వారిలో బెంగాల్, మహారాష్ట్రలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు అడ్మిన్ ఎస్ఐ రవీందర్ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu