కలెక్టర్‌ కారును ఢీకొన్న లారీ: యాదాద్రి భువనగిరి కలెక్టర్ కు తప్పిన ప్రమాదం

Published : Oct 15, 2020, 05:42 PM ISTUpdated : Oct 16, 2020, 12:38 AM IST
కలెక్టర్‌ కారును ఢీకొన్న లారీ: యాదాద్రి భువనగిరి కలెక్టర్ కు తప్పిన ప్రమాదం

సారాంశం

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  అనితా రామచంద్రన్ ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకొన్నారు. ఆమె ప్రయాణీస్తున్న కారు పాడైంది.

భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  అనితా రామచంద్రన్ ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకొన్నారు. ఆమె ప్రయాణీస్తున్న కారు పాడైంది.

భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటపొలాలు, ప్రాంతాలను పరిశీలించి వస్తున్న కలెక్టర్ కారును భువనగిరి సమీపంలో లారీ ఢీకొట్టింది. అతి వేగంగా వచ్చిన లారీ  కలెక్టర్ ప్రయాణీస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుండి కలెక్టర్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు.

వలిగొండ మండలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటపొలాలు, వరద ప్రాంతాలను పరిశీలించి ఆమె వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. అతి వేగంగా వచ్చిన లారీ కలెక్టర్ కారును ఢీకొట్టింది. దీంతో కలెక్టర్ కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఈ ప్రమాదం జరిగిన తర్వాత కలెక్టర్ మరో వాహనంలో వెళ్లిపోయారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu