భారీ వర్షాలతో రూ. 5 వేల కోట్ల నష్టం: రూ. 1350 కోట్లివ్వాలని మోడీకి కేసీఆర్ లేఖ

Published : Oct 15, 2020, 05:22 PM IST
భారీ వర్షాలతో రూ. 5 వేల కోట్ల నష్టం: రూ. 1350 కోట్లివ్వాలని మోడీకి కేసీఆర్ లేఖ

సారాంశం

భారీ వర్షాలు, వరదలతో  రాష్ట్రంలో  సుమారు రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని  తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. తక్షణ సహాయంగా రూ. 1350 కోట్లు ఇవ్వాలని ఆయన కోరారు.

హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో  రాష్ట్రంలో  సుమారు రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని  తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. తక్షణ సహాయంగా రూ. 1350 కోట్లు ఇవ్వాలని ఆయన కోరారు.

also read:ప్రోటోకాల్ రగడ: అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం (వీడియో)

కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ గురువారంనాడు లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో మున్సిపల్, వ్యవసాయ, రోడ్లుభవనాలు, విద్యుత్ శాఖ మంత్రులు కె.టి.రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు శ్రినివాస్ యాదవ్, మెహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, ఎస్ పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, మున్సిపల్ వ్యవసాయ, ఆర్ అండ్ బి శాఖల ముఖ్య కార్యదర్శులు, జిహెచ్ ఎంసి కమీషనర్, హైదరాబాద్ కలెక్టర్లు పాల్గొన్నారు.

 ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి కేసీఆర్ లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల విషయమై సీఎం కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్రంలో వరదలతో నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?
Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!