వై.ఎస్. షర్మిల పార్టీలో చేరిక ముహుర్తం ఎప్పుడో చెప్పేసిన కాంగ్రెస్ నేత

By narsimha lode  |  First Published Dec 31, 2023, 5:06 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.  కొత్త సంవత్సరంలో  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం చెప్పారు.



విజయవాడ: కొత్త సంవత్సరంలో  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం చెప్పారు.ఆదివారంనాడు విజయవాడలో  మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం మీడియాతో మాట్లాడారు.  ఆంధ్రప్రదేశ్ లో అన్యాయాలను సహించలేని వారంతా  తమతో చేతులు కలిపే అవకాశం ఉందని శీలం చెప్పారు. కొత్త సంవత్సర వేడుకల తర్వాత  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారన్నారు.కాంగ్రెస్ పార్టీలోకి ఎవరూ వచ్చినా స్వాగతిస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన స్వాగతిస్తామన్నారు.

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో  అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ  తదితరులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు.  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై  చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి కనీసం 15 శాతం  ఓట్ల శాతం వచ్చేలా ప్లాన్ చేయాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు కోరారు.

also read:గెలుపు గుర్రాలకే టిక్కెట్లు: వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితా ఇదీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీగా మాణిక్యం ఠాగూర్ ను  నియమించింది ఆ పార్టీ.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి  2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్నాయి.  నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

2014లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. దీంతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తైన తర్వాత  తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఉనికే లేకుండా పోయిన స్థితి నుండి మెరుగైన ఓట్లను తెచ్చుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. 
 

click me!