New Year Eve: జనవరి 1న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు

By Mahesh K  |  First Published Dec 31, 2023, 4:54 PM IST

జనవరి 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ఉన్నది. ఇటీవలే హాలీడే లిస్టు విడుదల చేసిన ప్రభుత్వంలో అందులో జనవరి 1వ తేదీన జనరల్ హాలీడేగా గుర్తించింది.
 


Holiday: తెలంగాణ వ్యాప్తంగా జనవరి 1వ తేదీన పాఠశాలలకు సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన సెలవు ఇస్తున్నట్టు తెలిపింది. జనవరి 1వ తేదీన జనరల్ హాలీడేగా గుర్తించింది. జనవరి 1వ తేదీని జనరల్ హాలీడేగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం సెలవుల జాబితాను ఇటీవలే విడుదల చేసింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఇతర అన్ని జిల్లాల్లోని పాఠశాలలకు జనవరి 1వ తేదీతోపాటు సంక్రాంతి పండుగ సందర్భంగా 14వ తేదీ, 15వ తేదీన సెలవులు ఉన్నాయి. గణతంత్రి దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Latest Videos

జనవరి 14వ తేదీన భోగి, 15వ తేదీన సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. 16వ తేదీన కనుముకు ఆప్షనల్ హాలీడేను పేర్కొంది.

Also Read: Praja Palana: అభయ హస్తానికి పార్లమెంటు ఎన్నికల కోడ్ గండం.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

ఎస్ఎస్‌సీ పరీక్షలకు సన్నద్ధం

రాష్ట్రంలో స్కూల్స్ పదో తరగతి పరీక్షల కోసం సిద్ధం అవుతున్నాయి. శనివారం విద్యా శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీన మొదలవుతాయి. ఏప్రిల్ 2వ తేదీన ముగుస్తాయి.

click me!