
బిర్యానీ ఆర్డర్ ఇస్తే దాంటో పాటు పురుగులు కూడా వచ్చాయి. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది నుంచి నిరక్షపు సమాధానం వచ్చింది. దీంతో రెస్టారెంట్ లో యువకులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన కొత్తగూడెంలోని సెవెన్ హిల్స్ లో చోటు చేసుకుంది.
బంపర్ ఆఫర్ ప్రకటించిన మెట్రో రైల్.. రూ.59 చెల్లిస్తే మూడు రోజులు ఫ్రీ రైడ్.. ఎప్పటి నుంచి అంటే ?
వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం సమీపంలోని టేకులపల్లికి చెందిన పలువురు యువకులు ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు. పని పూర్తయిన అనంతరం వారికి ఆకలి వేయడంతో సెవెన్ హిల్స్ ఏరియాలో ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. వెయిటర్ కు బిర్యానీ తీసుకురావాలని సూచించారు. కొంత సమయం తరువాత బిర్యానీ, పెరుగు వంటివి తీసుకొచ్చి టేబుల్ పై పెట్టాడు.
కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు.. తెలంగాణలో ప్రియాంక గాంధీ, డీకే శివ కుమార్ లకు ముఖ్య బాధ్యతలు..
యువకులు అంతా తినడం మొదలు పెట్టారు. కాసేపయ్యాక ఆ బిర్యానీలో పురుగులు ఉండటం వారు గమనించారు. పెరుగులోనూ అలాంటి కొన్ని చిన్న పురుగులు కనిపించాయి. ఇదేంటని సిబ్బంది ప్రశ్నించారు. కానీ వారు దీనిపై నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో యువకులు ఆగ్రహంతో వారందరినీ నిలదీశారు. ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై వివరాలు సేకరించారు. అనంతరం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కూడా వచ్చారు. తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.