ఇంట్లోకి దూరిమరీ.. మహిళపై అత్యాచారం, హత్య

Published : May 09, 2019, 10:37 AM IST
ఇంట్లోకి దూరిమరీ.. మహిళపై అత్యాచారం, హత్య

సారాంశం

ఒంటరి మహిళ ఇంట్లోకి దూరి మరీ...ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

ఒంటరి మహిళ ఇంట్లోకి దూరి మరీ...ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తుర్కపల్లి మండలం వెంకటాపూర్ కి చెందిన కర్రే అనురాధ అనే మహిళ స్థానికంగా బెల్టు షాప్‌ నిర్వహిస్తోంది. అర్థరాత్రి వేళ దుండగులు అనురాధ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హతమార్చారు. ఇంట్లోని నగలు, నగదు దోచుకు వెళ్లారు. 

గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్‌ ...ఆధారాలు సేకరిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు