శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

By Nagaraju penumalaFirst Published May 9, 2019, 10:03 AM IST
Highlights

ఆ యువకుడి దగ్గర నుంచి 3.329 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ కోటి రూపాయలు పైనే ఉంటుందని కస్టమ్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. లోదుస్తులలో పలు చోట్లు జేబులు కుట్టుంచుకుని వాటిలో బంగారం పెట్టి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. 
 
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులు కస్టమ్స్ అధికారులకు చిక్కారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన యువకుడిని కస్టమ్స్ అధికారులు తనఖీలు చేయగా అతని దగ్గర నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. 

ఆ యువకుడి దగ్గర నుంచి 3.329 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ కోటి రూపాయలు పైనే ఉంటుందని కస్టమ్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. లోదుస్తులలో పలు చోట్లు జేబులు కుట్టుంచుకుని వాటిలో బంగారం పెట్టి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. 

యువకుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. బంగారం ఎవరిది, ఎక్కడికి తరలిస్తున్నారు అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇకపోతే బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్లను కూడ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

స్మగ్లర్లలో ఒకరు రెక్టమ్ కన్ సీల్ మెంట్ రూపంలో, మరోకరు పౌడర్ గా మార్చి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 4 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇకపోతే రెండు రోజుల వ్యవధిలో ఏడు కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. 
 
click me!