ఆ ఫోటోలు బయటపెట్టనా..? యువతికి మాజీ ప్రియుడి బెదిరింపులు

Published : Apr 19, 2019, 08:23 AM IST
ఆ ఫోటోలు బయటపెట్టనా..? యువతికి మాజీ ప్రియుడి బెదిరింపులు

సారాంశం

తనను పెళ్లి చేసుకోకపోతే తన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ.. ఓ యువతిని ఆమె మాజీ ప్రియుడు వేధించాడు. కాగా.. అతని వేధింపులు తట్టుకోలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  

పూర్తి వివరాల్లోకి వెళితే...బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లోని ఇందిరానగర్‌లో నివసించే ఓ యువతి(18) జూబ్లీహిల్స్‌లోని ఓ పత్రికా కార్యాలయంలో హౌస్‌కీపింగ్‌ విభాగంలో పనిచేస్తుంది. అక్కడే పనిచేస్తున్న శివ(22) అనే అటెండర్‌తో యువతికి పరిచయం ఏర్పడింది.

 వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ సమయంలో ఫొటోలు దిగారు.  అయితే.. అతని ప్రేమను అంగీకరించిన నాటి నుంచి శివలో చాలా మార్పు వచ్చింది. ఆమెను పలు రకాలుగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో శివ ఆమెను వేధిస్తుండటంతో ఆమె అతన్ని దూరం పెట్టేందుకు ప్రయత్నించింది. ఇదే సమయంలో ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లిని నిశ్చయం చేశారు. 

అది జీర్ణించుకోలేని శివ తననే పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతానంటూ బెదిరింపులకు దిగాడు. నెలలుగా యువతి కుటుంబ సభ్యులనూ వేధిస్తున్నాడు. శివ వేధింపులు తట్టుకోలేని ఆ యువతి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా