తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల:టాప్‌లో మేడ్చల్, లాస్ట్‌లో మెదక్

By narsimha lodeFirst Published 18, Apr 2019, 5:11 PM IST
Highlights

తెలంగాణలో ఇంటర్ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు గురువారం నాడు విడుదల చేసింది. 


హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు గురువారం నాడు విడుదల చేసింది. 

గురువారం నాడు హైద్రాబాద్‌లో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. 

ఇంటర్ పరీక్షల్లో బాలికలదే పై చేయిగా ఉందని  ఇంటర్ బోర్డు ప్రకటించింది.ఇంటర్ ఫస్టియర్‌లో 59.8 శాతం,  సెకండియర్‌లో 65 శాతం మంది ఉత్తీర్ణులైనట్టుగా జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.ఫస్టియర్‌ పరీక్షలకు 9,42,719 మంది విద్యార్థులు హాజరయ్యారు. సెకండియర్ పరీక్షలకు 4,90వేల169 మంది విద్యార్థులు హాజరైనట్టుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇంటర్మీడియట్ పరీక్షల్లో మేడ్చల్, రంగారెడ్డి, మెదక్ చివరి స్థానంలో నిలిచినట్టుగా జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 14వ తేదీ నుండి  నిర్వహించనున్నట్టు చెప్పారు.అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున ఈ తేదీల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందన్నారు.

Last Updated 18, Apr 2019, 5:22 PM IST