ఎంపిటీసి, జడ్పిటీసిలతో ప్రజలకేం ఉపయోగం లేదు: కిషన్ రెడ్డి

By Arun Kumar PFirst Published Apr 18, 2019, 8:31 PM IST
Highlights

ప్రజలకు అసలు ఉపయోగపడని ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంత తొందర పడుతుందో అర్థం కావడం లేదని బిజెపి నాయకులు కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ నిరుద్యోగులకు తప్ప ఈ ఎన్నికలు సామాన్య ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగడవని ఆరోపించారు. అంతేకాకుండా వీరికున్న పరిమిత అధికారాలు కూడా అభివృద్ది, పాలనలో అంత ప్రముఖమైన పాత్రేమీ వహించవని...కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ ఎన్నికల నిర్వహణకు ఆగమేఘాల  మీద చర్యలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

నిజంగానే ఈ ఎన్నికలపై అంత చిత్తశేద్దే వుంటే ఎంపీపీ, జడ్పీ చైర్ పర్సన్ల పదవులకు కూడా ప్రత్యక్షంగానే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంపై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని పార్టీల సూచనలను స్వీకరించాలన్నారు. అలా కాకుండా ఇదే పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తామంటే తాము ఊరుకునేది లేదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. 

ఇక దేశవ్యాప్తంగా దళితులకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే సరైన గౌరవాన్ని ఇస్తోందని...రాష్ట్రంలో వారి  హక్కులను రక్షణ లేకుండా పోయిందన్నారు. పాలకులు రాజ్యాంగ రచయిత  అంబేద్కర్ పై గౌరవంతో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాలి కానీ ఇక్కడ విగ్రహాలను కూల్చివేసి అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఆయర ఒక్కరినే కాదు యావత్ దళిత సమాజం ఆత్మగౌరవంపై దెబ్బకొడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు ఏర్పాటయిని 99శాతం ప్రముఖుల విగ్రహాలు అనుమతిలేనివేనని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. వాటిని కాకుండా కేవలం అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఎందుకు కూల్చివేశారో చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని,టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే తాను ముఖ్యమంత్రి అయిన విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకుంటే మంచిదని కిషన్ రెడ్డి అన్నారు. 

click me!