పీకలదాకా తాగి ఊగుతూ.. పోలీసులకు చుక్కలు చూపుతున్న యువతులు

By sivanagaprasad kodatiFirst Published Oct 22, 2018, 12:59 PM IST
Highlights

వీకెండ్ వస్తే చాలు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన అమ్మాయిలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపుతున్నారు. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో నగరంలోని చాలామంది యువతులు ప్లబ్బుల్లో, క్లబ్బుల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు.

వీకెండ్ వస్తే చాలు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన అమ్మాయిలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపుతున్నారు. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో నగరంలోని చాలామంది యువతులు ప్లబ్బుల్లో, క్లబ్బుల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. తాగిన మత్తులో పోలీసులకు సహకరించకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

గత శనివారం రాత్రి జరిగిన డ్రంకన్ డ్రైవ్‌లో ఇద్దరు యువతులు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. ఫిలింనగర్‌ వద్ద డ్రంకన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువతులను అడ్డుకున్నారు.. మహిళా కానిస్టేబుల్ సాయంతో బ్రీతింగ్ టెస్ట్ చేయించేందుకు ప్రయత్నించారు.

అయితే వాహనం నడుపుతున్న యువతి అందుకు సహకరించపోగా.. వారితో వాగ్వివాదానికి దిగింది. వెనకాల ఉన్న యువతిని వదిలేయాలంటూ పోలీసులను కోరింది. అర్థగంట పాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి చివరికి బ్రీతింగ్ టెస్ట్ చేయించుకుంది. ఇందులో ఆమె మద్యం తాగినట్లు నిర్థారణ అయ్యింది.

ఆ వెంటనే మరో కారులో వచ్చిన యువతి సైతం.. పోలీసులతో ఇదే స్థాయిలో వాగ్వావాదనికి దిగింది. ఆమె సైతం బ్రీతింగ్ టెస్టుకు అంగీకరించకపోవడంతో.. పోలీసులు బలవంతంగా ఆమెకు శ్వాస పరీక్ష నిర్వహించగా.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లుగా తేలింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాహనం స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 112 మందిపై కేసులే నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
 

click me!