ఆత్మలు నన్ను వెంటాడుతున్నాయంటూ...

By ramya neerukondaFirst Published Oct 10, 2018, 10:40 AM IST
Highlights

కొన్ని నెలలు గా తనను దుష్టశక్తులు, ఆత్మలు వెంటాడుతున్నాయంటూ అతియా షకీర్ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నది. తనను హైదరాబాద్‌కు పంపించాలంటూ భర్తకు చెప్పడంతో మూడు రోజుల క్రితం కెనెడా నుంచి పంపించాడు. 

ఆత్మలు, కొన్ని దుష్ట శక్తులు వేంటాడుతున్నాయంటూ ఓ మహిళ అదోరకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ డిప్రెషన్ లో భవనంపై నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ఫరిధిలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నం.10 లోని జహీరానగర్‌కు చెందిన అతియా షకీర్(42) , భర్త మహ్మద్ షకీర్‌తో కలిసి కెనెడాలో నివాసం ఉంటున్నది. వారికి ఐదుగురు పిల్లలు. కాగా... కొన్ని నెలలు గా తనను దుష్టశక్తులు, ఆత్మలు వెంటాడుతున్నాయంటూ అతియా షకీర్ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నది. తనను హైదరాబాద్‌కు పంపించాలంటూ భర్తకు చెప్పడంతో మూడు రోజుల క్రితం కెనెడా నుంచి పంపించాడు. 

టోలీచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్న సోదరుడు జమీల్ ఉర్ రహ్మాన్ ఇంటికి వచ్చిన అతియా షకీర్ రెండు రోజులుగా జహీరానగర్‌లోని సొంతింట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవనంలోని ఐదో అంతస్తు పైకి ఎక్కిన అతియా కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న అతియా షకీర్ సోదరుడు జమీల్ ఉర్ రహ్మాన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఎవరిపై అనుమానం లేదని, డిప్రెషన్‌తో బాధపడుతుండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వారు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

click me!