దారుణం : అల్లుడిమీద కిరోసిన్ పోసి నిప్పంటించిన అత్త.. సహకరించిన కూతురు.. !!

Published : Aug 30, 2021, 09:58 AM IST
దారుణం : అల్లుడిమీద కిరోసిన్ పోసి నిప్పంటించిన అత్త.. సహకరించిన కూతురు.. !!

సారాంశం

ఈ నెల 13న కుమార్తెను చూసేందుకు నాని ఆమె వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అత్త, అల్లుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అల్లుడు మాటలకు ఆగ్రహం చెందిన అత్త తిరుపతమ్మ అలియాస్ పార్వతమ్మ (45), కుమార్తెతో కలిసి అతడిమీద కిరోసిన్ పోసి నిప్పంటించింది. 

మల్కాజిగిరి : హైదరాబాద్ లో దారుణం జరిగింది. కూతురిని వేధిస్తున్నందుకు అల్లుడిమీద కిరోసిన్ పోసి నిప్పంటించిందో అత్తగారు. అందుకు కూతురు కూడా సహకరించింది. ఈ ఘటనలో కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చేరిన యువకుడు శనివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

ఎస్సై యాదగిరి కథనం ప్రకారం.. అడ్డగుట్ట పోచమ్మ దేవాలయం వద్ద నివసించే దండుగళ్ల నాని (28) కారు డ్రైవర్. మల్కాజిగిరి ఠాణా పరిధిలోని జేఎల్ఎన్ఎస్ నగర్ లో నివసించే అనిత అలియాస్ సోని (26)తో 2015లో వివాహం జరిగింది. 

వీరికి నాలుగేళ్ళ కుమార్తె హాసిని కూడా ఉంది. నానికి మద్యం అలవాటు ఉంది. తాగిన మైకంలో భార్యను వేధించేవాడు. రోజులు గడిచినా కొద్ది భర్త ప్రవర్తనలో మార్పు రాకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో తొమ్మిది నెలల క్రితం మల్కాజిగిరి ఠాణాలో ఫిర్యాదు చేసింది. 

అప్పటినుంచి తల్లితో ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 13న కుమార్తెను చూసేందుకు నాని ఆమె వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అత్త, అల్లుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అల్లుడు మాటలకు ఆగ్రహం చెందిన అత్త తిరుపతమ్మ అలియాస్ పార్వతమ్మ (45), కుమార్తెతో కలిసి అతడిమీద కిరోసిన్ పోసి నిప్పంటించింది. గాంధీలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి అతడు మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu
Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu