కామారెడ్డి జిల్లాలో దారుణం: మహిళ గొంతుకోసిన దుండగులు, పరిస్థితి విషమం

Published : Aug 31, 2021, 09:39 AM ISTUpdated : Aug 31, 2021, 09:45 AM IST
కామారెడ్డి జిల్లాలో దారుణం: మహిళ గొంతుకోసిన దుండగులు, పరిస్థితి విషమం

సారాంశం

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. ఇవాళ ఉదయం తన ఇంటి వద్ద ముగ్గు వేస్తున్న మహిళ గొంతు కోశారు దుండగులు. పరిస్థితి విషమంగా ఉండడంతో మహిళను ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కామారెడ్డి:  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బర్కత్‌పుర కాలనీలో మహిళ గొంతుకోసి పారిపోయాడు ఓ దుండగుడు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. నిషా అనే మహిళ తన ఇంటి వద్ద మంగళవారం నాడు ఉదయం ముగ్గు వేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ గొంతు కోశారని స్థానికులు చెప్పారు.

 

బాధితురాలిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స చేశారు. గొంతు నరాలు తెగినట్టుగా వైద్యులు గుర్తించారు.బాధితురాలిని కాపాడేందుకు వైద్యలు చికిత్స ప్రారంభించారు.అయితే మహిళ గొంతు కోయడానికి గల కారణాలు తెలియరాలేదు.  ఈ విషయమై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్