లోన్ యాప్ కీచకుల ఘాతుకం : అప్పు కట్టలేదని వేధింపులు, బంధువుల ఫోన్‌కి మార్ఫింగ్ ఫోటోలు .. మహిళ ఆత్మహత్య

Siva Kodati |  
Published : May 18, 2022, 07:11 PM IST
లోన్ యాప్ కీచకుల ఘాతుకం : అప్పు కట్టలేదని వేధింపులు, బంధువుల ఫోన్‌కి మార్ఫింగ్ ఫోటోలు .. మహిళ ఆత్మహత్య

సారాంశం

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మంచిర్యాల జిల్లాలో ఓ మహిళ బలైపోయింది. అప్పు కట్టలేదని బాధితురాలి మార్ఫింగ్ ఫోటోలను ఆమె బంధువులకు షేర్ చేశారు . దీనిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. 

మంచిర్యాల జిల్లాలో (mancherial district) లోన్ యాప్‌ (loan apps) వేధింపులకు మహిళ ఆత్మహత్య చేసుకుంది. బొల్లు కళ్యాణి అనే మహిళ రూ.30 వేలు లోన్ తీసుకుంది. లోన్ సకాలంలో చెల్లించకపోవడంతో కళ్యాణిని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి.. బంధువులు, స్నేహితులకు పంపారు లోన్ యాప్ కీచకులు. దీంతో అవమానాన్ని భరించలేక మనస్తాపంతో కళ్యాణి ఆత్మహత్యకు (suicide) పాల్పడింది. చనిపోయిన తర్వాత కూడా వేధింపులు ఆగకపోవడం గమనార్హం. మృతదేహం ఫోటో పంపాలంటూ బంధువులను వేధింపులకు గురిచేస్తున్నారు  లోన్ యాప్ నిర్వాహకులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం