తీర్పు ఆలస్యమవుతుందని.. హై కోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం..

By AN TeluguFirst Published Oct 6, 2020, 3:40 PM IST
Highlights

తెలంగాణ హైకోర్టులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. చాలా రోజులుగా తన కేసు పెండింగ్ లో ఉండడం, రోజూ తీర్పు కోసం ఎదురు చూడడంతో నిరాశచెందిన ఓ యువతి కోర్ట్ బిల్డింగ్ మీదినుండి దూకే ప్రయత్నం చేసింది.  

హైకోర్టు మొదటి అంతస్తులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కవిత అనే మహిళ తన కేసులో తీర్పు చాలా కాలంగా పెండింగ్ లో ఉండడంతో నిరాశలో కూరుకుపోయింది. దీంతో మంగళవారం ఆమె కోర్టు భవనం నుండి దూకే ప్రయత్నం చేసింది. అయితే అది గమనించిన హైకోర్టు భద్రతా సిబ్బంది ఆమెను వెంటనే అడ్డుకున్నారు.

కిందికి పడకుండా పట్టుకుని పైకి లాగడంతో ఆమె ప్రాణాలతో బతికి బైటపడింది. ఈ ఘటన హైకోర్టులో కాసేపు కలకలానికి దారి తీసింది. రక్షించిన తరువాత హైకోర్టు  సెక్యూరిటీ ఆఫీసులో కవితను కూర్చోబెట్టి వివరాలు కనుక్కున్నారు. ఆమె కేసు, ఇతర వివరాలు భద్రతా సిబ్బంది సేకరించారు. 

గోదావరిఖనికి చెందిన కవిత మీద ఏప్రిల్ 11న మురళిఅనే వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. ఈ మేరకు కేసు విచారణ జరుగుతోంది. అయితే ఆరునెలలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా తనకు తీర్పు రావడం లేదంటూ మానసికంగా కృంగిపోయిన కవిత ఈ దారుణానికి ఒడిగట్టింది. 

click me!