వ్యాపారవేత్త కిడ్నాప్... సినిమా స్టైల్లో పోలీస్ చేజింగ్, కిడ్నాపర్ల అరెస్ట్

Arun Kumar P   | Asianet News
Published : Oct 06, 2020, 12:03 PM ISTUpdated : Oct 06, 2020, 12:12 PM IST
వ్యాపారవేత్త కిడ్నాప్... సినిమా స్టైల్లో పోలీస్ చేజింగ్, కిడ్నాపర్ల అరెస్ట్

సారాంశం

హైదారాబాద్ కు చెందిన ఒక వ్యాపారవేత్తను ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. 

కరీంనగర్: హైదరాబాద్ లో కిడ్నాప్ కు గురయిన ఓ వ్యాపారవేత్తను కాపాడేందుకు సినీ పక్కీలో కారును చేజింగ్ చేశారు పోలీసులు.  కిడ్నాపర్లు కూడా పోలీసులకు చిక్కకుండా కారును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో వారిని చేజింగ్ చేసిమరీ పట్టుకుని వ్యాపారవేత్తను కాపాడారు పోలీసులు. ఈ చేజింగ్ ను చూసి అసలేం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 

 హైదారాబాద్ కు చెందిన ఒక వ్యాపారవేత్తను ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. అతన్ని కారులో తీసుకుని వెళుతుండగా దొంగలమర్రి వద్ద తనీఖీ జరుగుతుండటంతో పోలీసులకు చిక్కకుండా కారును వేగంగా పోనిచ్చారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ వాహనంలో ఆ కారును చేజ్ చేశారు.

ఈ క్రమంలోనే కొడిమ్యాల శివారులో కారు ఆగడంతోనే ఇద్దరు కిడ్నాపర్లు పరారయ్యారు. మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారవేత్తను క్షేమంగా కాపాడటంతో పాటు కారును స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. 

సంఘటన స్థలాన్ని డిఎస్పి వెంకటరమణ, సిఐ కిశోర్ పరిశీలించారు. ఈ ఘటనలో పొలీసులు ఎప్పటినుండో వెతుకుతున్న పాత నేరస్తులు పట్టు బడినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు జరిగిన కిడ్నాప్ కు కూడా ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vande Bharat Sleeper : హైదరాబాద్ టు డిల్లీ ట్రైన్ జర్నీ ఇక విమానం కంటే లగ్జరీ.. వందే భారత్ స్లీపర్ ఎక్కితే వావ్ అనాల్సిందే!
Heavy Rain Alert : ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. ఏయే జిల్లాలంటే?