శారీరకంగా వాడుకుని వదిలేసాడు...: ప్రియుడి ఇంటిముంది యువతి ఆందోళన (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 28, 2021, 04:17 PM ISTUpdated : Sep 28, 2021, 04:19 PM IST
శారీరకంగా వాడుకుని వదిలేసాడు...: ప్రియుడి ఇంటిముంది యువతి ఆందోళన (వీడియో)

సారాంశం

ప్రేమిస్తున్నానని నమ్మించి శారీరకంగా వాడుకుని వదిలేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటిముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జగిత్యాల: ప్రేమించాలంటూ వెంటబడ్డాడు. అతడి ప్రేమ నిజమేనని నమ్మి శారీరకంగా దగ్గరయ్యాను. ఆ తర్వాతే అతడి నిజస్వరూపం బయటపడింది. పెళ్లి చేసుకోమనే సరికి ప్రియుడు ముఖం చాటేయడంతో మోసపోయానని ఆమె గ్రహించింది. దీంతో న్యాయం కోసం ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలపూర్ గ్రామనికి చెందిన సర్వాజి తిరుమల రావు తనను మోసం చేశాడని లత అనే యువతి ఆరోపిస్తోంది. ప్రేమిస్తున్నానంటూ తన వెంటపడి నమ్మించాడని... అతడి ప్రేమను నిజమని నమ్మానని తెలిపింది. ఎలాగూ పెళ్లిచేసుకుంటాం కదా అని అతడితో శారీరకంగా కూడా దగ్గరయ్యాయని లత తెలిపింది. 

వీడియో

ప్రియుడు తిరుమల రావుకు చాలాసార్లు ఆర్థికంగాను సాయం చేశానని లత తెలిపింది. ఇలా ఆర్థికంగా, శారీరకంగా తనను వాడుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే ఒప్పుకోవడం లేదని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. 

పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చినప్పటి నుండి తనను దూరం పెడుతున్నాడని లత తెలిపింది. అందువల్లే న్యాయం కోసం తిర్మలపూర్ లోని తిరుమలరావు ఇంటిముందు కూర్చుని ఆందోళనకు దిగినట్లు బాధిత యువతి లత వెల్లడించింది. పోలీసులు, గ్రామ పెద్దలు ఒకరంటే ఒకరం ఇష్టపడి ప్రేమించుకున్న తమకు పెళ్లిచేయాలని లత కోరుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు